తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతుల సమస్యలను కాంగ్రెస్​ ఏనాడు పట్టించుకోలేదు : బస్వ - నిజామాబాద్ జిల్లా తాజా వార్తలు

దాదాపు 60 సంవత్సరాలు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ​రైతుల సమస్యలను ఏనాడు పట్టించుకోలేదని... నిజామాబాద్​ జిల్లా భాజపా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య విమర్శించారు. ఆర్మూర్​లో శనివారం జరిగిందసలు రాజీవ్ రైతు దీక్ష కాదని, అది కాంగ్రెస్ దీక్షని అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

nizamabad district BJP president held Press conference at district party office
రైతుల సమస్యలను కాంగ్రెస్​ ఏనాడు పట్టించుకోలేదు: భాజపా

By

Published : Jan 31, 2021, 4:52 PM IST

దాదాపు 60 సంవత్సరాలు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ​రైతుల సమస్యలను ఏనాడు పట్టించుకోలేదని.. నిజామాబాద్ జిల్లా భాజపా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య విమర్శించారు. ఆర్మూర్​లో శనివారం జరిగింది రాజీవ్ రైతు దీక్ష కాదని అది కాంగ్రెస్ దీక్షని జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అన్నారు. అలాంటి పార్టీ నాయకులకు భాజపాను విమర్శించే స్థాయి ఏ మాత్రం లేదని ఎద్దేవా చేశారు.

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్​, సుగంధ ద్రవ్యాల బోర్డును జిల్లాకు తీసుకొచ్చి పసుపు రైతులకు లాభం చేకూర్చారని చెప్పారు. రాజీవ్ రైతు దీక్షలో ఏ ఒక్క రైతు లేడని, కేవలం అది యువజన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంగా ఉందని తెలిపారు. టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం బలం నిరూపించుకోవడానికి రేవంత్ రెడ్డి ఆ దీక్ష చేశారని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి పాలన నడుస్తుంటే కాంగ్రెస్ పార్టీ దానిపై ప్రశ్నించడం లేదన్నారు.

ఇదీ చదవండి: రైతుల దీక్షకు మద్దతుగా ట్రాక్టర్లతో కాంగ్రెస్ ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details