నిజామాబాద్‌లోని కాంగ్రెస్ భవన్లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాప సభ నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటులో ప్రణబ్ ముఖర్జీదే కీలక పాత్ర అని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. ప్రణబ్ మరణం తీరని లోటని, కాంగ్రెస్ విజయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.
తెలంగాణ ఏర్పాటులో ప్రణబ్‌ది కీలక పాత్ర: మోహన్ రెడ్డి - pranab mukharji latest news
తెలంగాణ ఏర్పాటులో ప్రణబ్ ముఖర్జీదే కీలక పాత్ర అని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లోని కాంగ్రెస్ భవన్లో ప్రణబ్ ముఖర్జీ సంతాప సభలో పాల్గొన్నారు.
తెలంగాణ ఏర్పాటులో ప్రణబ్‌ది కీలక పాత్ర: మోహన్ రెడ్డి
దేశ ప్రథమ పౌరుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, మంత్రిగా ఏ పదవిలో ఉన్న దేశ అభివృద్ధి కొరకు కృషి చేశారని కొనియాడారు. దేశ ప్రజలు ఆయన సేవలను మరచిపోలేరని, ప్రణబ్ ముఖర్జీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ పాల్గొన్నారు.
ఇవీచూడండి:దారుణం: ఆడపిల్లలు పుట్టారని పురుగులమందు తాగించిన తండ్రి