తెలంగాణ

telangana

ETV Bharat / state

'అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ల బిల్లులను రద్దు చేయాలి' - నిజామాబాద్ సీపీఎం కార్యాలయంలో ఆందోళన

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ల బిల్లులను రద్దు చేయాలని కోరుతూ వామపక్ష పార్టీల నాయకులు నిజామాబాద్ సీపీఎం కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. బిల్లులు కట్టనివారి దగ్గరి నుంచి 15 తేదీ తర్వాత రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తామని నగర కమిషనర్ చెప్పడం దారుణమన్నారు.

cpm leaders protest
'అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ల బిల్లులను రద్దు చేయాలి'

By

Published : Aug 2, 2020, 1:24 PM IST

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ల బిల్లులను రద్దు చేయాలని కోరుతూ సీపీఎం కార్యాలయంలో నాయకులు ఆందోళన చేపట్టారు. నగర కార్పొరేషన్ పరిధిలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ తీసుకొనడానికి ఈ నెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకుని... బిల్లును చెల్లించాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. 15 తర్వాత రెట్టింపు చార్జీలను వసూలు చేయడం జరుగుతుందని అందులో పేర్కొన్నారు.

ఓ వైపు కరోనా కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే... నిజామాబాద్ మున్సిపల్ పాలకవర్గం దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారికి ఒక రేటును, ఆపైన ఆదాయాలు ఉన్నవారికి మరొక రేటును, వ్యాపార వాణిజ్య సంస్థలకు ఇంకొక రేటును నిర్ణయించి 15వ తేదీ లోపు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లను తీసుకోవాలని చెప్పినట్లు తెలిపారు. ఈ లోపు తీసుకోని వారికి 15 తర్వాత రెట్టింపు చార్జీలను వసూలు చేస్తామని ప్రకటనలు ఇవ్వటం పూర్తిగా బాధ్యతారాహిత్యమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:గుండె, ఊపిరితిత్తులపై కరోనా దాడి.. రక్తనాళాలపై దుష్ప్రభావం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details