తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపు నిజామాబాద్​లో144 సెక్షన్ అమలు: కమిషనర్ - Nizamabad CP On Elections

నిజామాబాద్ లోక్​సభ కౌంటింగ్ కోసం మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు పట్టణ పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాలను పాటిస్తూ.. కౌంటింగ్ ప్రశంతంగా సాగేలా భద్రత ఏర్పాటు చేశామన్నారు.

రేపు నిజామాబాద్​లో144 సెక్షన్ అమలు: కమిషనర్

By

Published : May 22, 2019, 9:19 PM IST

రేపు నిజామాబాద్​లో144 సెక్షన్ అమలు: కమిషనర్

నిజామాబాద్ లోక్​సభ ఎన్నికల కౌంటింగ్ కోసం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు పట్టణ పోలీసు కమిషనర్ కార్తికేయ వెల్లడించారు. సిబ్బంది, ఏజెంట్ల కోసం మూడు పార్కింగ్ స్థలాలతోపాటు ఐదు చోట్ల చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. కమిషనరేట్ పరిధిలో ఇవాళ రాత్రి నుంచి ఎల్లుండి వరకు 144 సెక్షన్ విధించామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద వంద మీటర్ల లోపు నో వెహికిల్ జోన్​గా ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు, మీడియాకు వేర్వేరుగా ద్వారాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details