తెలంగాణ

telangana

ETV Bharat / state

'మీ జీవితం కాంగ్రెస్ పెట్టిన భిక్ష.. నోరు జాగ్రత్త' - NIZAMABAD CONGRESS PARTY FIRES ON BJP MP ARVIND

ఎన్నికల సమయంలో నిజామాబాద్ పసుపు రైతులకు ఇచ్చిన హామీలను ఎంపీ అర్వింద్ నెరవేర్చాలని కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి వెల్లడించారు. ఆయన చేతలకు, ఆయన మాట్లాడే మాటలకు పొంతన లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు.

NIZAMABAD CONGRESS PARTY FIRES ON BJP MP ARVIND
'కాంగ్రెస్ పెట్టిన భిక్షే... నీ జీవితం'

By

Published : Dec 16, 2019, 9:45 PM IST

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్​పై కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి విమర్శనాస్త్రాలు చేశారు. అర్వింద్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎన్నికల సమయంలో గెలిచిన 5 రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పిన ఆయన కాంగ్రెస్​పై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు మీ మానసిక స్థితిపై డాక్టర్ల సలహా తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. కాంగ్రెస్ కల్పించిన భిక్ష నీ జీవితమని గుర్తుంచుకుంటే బాగుంటుందని హెచ్చరించారు. నీ చదువు, నీ ఆస్తి, నీ వ్యాపారాలు మొత్తం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సంక్రమించాయని... గుర్తుంచుకొని మాట్లాడాలని హితవు పలికారు.

'కాంగ్రెస్ పెట్టిన భిక్షే... నీ జీవితం'

ఇదీ చూడండి: భార్య ఫిర్యాదు.. ట్రైనీ ఐపీఎస్​ సస్పెండ్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details