ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద చేపట్టిన పనులకు వెంటనే నిధులు విడుదల చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు కింద చేపట్టిన ప్యాకేజ్ 20, 21, 22 పనుల కోసం నిధులు విడుదల చేయకపోవడం వల్ల పనులు ముందుకు సాగడం లేదని విమర్శించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కేటాయింపులు చేయాలని కోరారు. అలాగే ఈ ప్యాకేజ్ పనుల పరిశీలన కోసం వచ్చే నవంబర్లో పాదయాత్ర చేస్తామని షబ్బీర్ అలీ ప్రకటించారు. ప్రాజెక్టుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణి పట్ల కాంగ్రెస్ నేత సుదర్శన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రాజెక్టులకై కాంగ్రెస్ నేతల పాదయాత్ర - ప్రాజెక్టులకై కాంగ్రెస్ నేతల పాదయాత్ర
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తెరాస ప్రభుత్వం వ్యవరిస్తున్న నిర్లక్ష్య ధోరణి పట్ల కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డిలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. నవంబర్లో పాదయాత్ర చేస్తామని స్పష్టం చేశారు.
![ప్రాజెక్టులకై కాంగ్రెస్ నేతల పాదయాత్ర](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4268725-632-4268725-1566991951794.jpg)
ప్రాజెక్టులకై కాంగ్రెస్ నేతల పాదయాత్ర
TAGGED:
March in November