ప్రధానిగా పీవీ నరసింహారావు చేపట్టిన ఆర్థిక సంస్కరణలు.. దేశాన్ని ప్రగతిపథంలో నడిపాయని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మనల మోహన్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని కాంగ్రెస్ భవన్‌లో పీవీ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
'పీవీ సంస్కరణలు దేశాన్ని ప్రగతిపథంలో నడిపాయి' - నిజామాబాద్లో పీవీ నరసింహారావు శత జయంతి
పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలను నిజామాబాద్ కాంగ్రెస్ భవన్‌లో నిర్వహించారు. పీవీ చిత్రానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
pv narasimha rao
సామాన్య కార్యకర్త స్థాయి నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన పీవీ... తెలుగువారికి గర్వకారణమని కొనియాడారు. రాజనీతిజ్ఞుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు.
ఇదీ చదవండి:కరోనా విలయ తాండవం.. రాష్ట్రంలో 13వేలు దాటిన కేసులు