తెలంగాణ

telangana

ETV Bharat / state

'వ్యవసాయ బిల్లుతో చీకట్లోకి రైతన్నల జీవితాలు' - central agriculture bill

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలని నిజామాబాద్​ జిల్లా కాంగ్రెస్​ కమిటీ డిమాండ్ చేసింది. ఈమేరకు కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు.

Nizamabad congress committee
నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ

By

Published : Sep 28, 2020, 2:23 PM IST

కోట్లాది రైతుల సంక్షేమాన్ని పణంగా పెట్టి తమకు మద్దతుగా ఉన్న బడా కార్పొరేట్ల కోసం మోదీ సర్కార్ వ్యవసాయ బిల్లును ప్రవేశపెట్టిందని నిజామాబాద్​ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆరోపించింది. వ్యవసాయ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ నారాయణరెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ బిల్లుతో కోట్లాది అన్నదాతల జీవితాలు చీకట్లోకి వెళ్లిపోతాయని కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలోకి పోతుందని వాపోయారు. కొంత మంది వ్యాపారుల లాభాపేక్ష వల్ల పేద, చిన్న, సన్నకారు రైతుల జీవితాలు ఛిన్నాభిన్నమవుతాయని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details