నిజామాబాద్ జిల్లాలో వాయిదా పడిన బార్ల కేటాయింపును అధికారులు ఈ రోజు నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి హజరయ్యారు. డ్రాలో గెలుపొందిన వారికి బార్ల నిర్వహణను అప్పగించారు.
బార్ల కేటాయింపులకు డ్రా నిర్వహించిన కలెక్టర్ - బార్ల కేటాయింపుకు డ్రా నిర్వహించిన నిజామాబాద్ కలెక్టర్
నిజామాబాద్ జిల్లాలో వాయిదా పడ్డ బార్ల కేటాయింపును అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హజరైన జిల్లా కలెక్టర్ మొత్తం 11 బార్లకు డ్రా తీశారు.
![బార్ల కేటాయింపులకు డ్రా నిర్వహించిన కలెక్టర్ nizamabad Collector who conducted the draw for the allocation of deferred bars](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10921711-271-10921711-1615204087362.jpg)
బార్ల కేటాయింపుకు డ్రా నిర్వహించిన కలెక్టర్
జిల్లాలోని నిజామాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 07, ఆర్మూరు మున్సిపాలిటీలో 01, బోధన్ మున్సిపాలిటీలో 03 బార్లకు డ్రా తీసిన కలెక్టర్ గెలుపొందిన వారికి బార్లను కేటాయించారు. దరఖాస్తు చేసుకున్న వారందరు ఈ కార్యక్రమానికి హజరై ఆసక్తిగా తిలకించారు.
ఇదీ చదవండి:కార్మిక క్షేత్రంలో మగువ తెగువ... మరమగ్గంతో భర్తకు చేయూత
Last Updated : Mar 8, 2021, 7:02 PM IST