తెలంగాణ

telangana

ETV Bharat / state

కలెక్టరేట్​ నిర్మాణ పనులు పరిశీలించిన పాలనాధికారి - నిజామాబాద్

నిజామాబాద్​లో  నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్​ భవనాన్ని జిల్లా కలెక్టర్​ రామ్మోహన్​రావు సందర్శించారు. పనులను నవంబర్​నాటికి పూర్తి చేసి అప్పగించాలని ఆర్​ అండ్​ బీ అధికారులకు ఆదేశించారు.

కలెక్టరేట్​ నిర్మాణ పనులు పరిశీలించిన పాలనాధికారి

By

Published : Oct 12, 2019, 11:35 PM IST

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో రూ.34 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన నూతన కలెక్టర్ భవన నిర్మాణ పనులను నవంబర్ చివరికి పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం. రామ్మోహనరావు అధికారులను ఆదేశించారు. నూతనంగా నిర్మించే కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. నవంబర్ చివరినాటికి మొత్తం పనులు పూర్తి చేసి అప్పగించాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. రోడ్లు భవనాల శాఖ పర్యవేక్షణ ఇంజినీర్ మధుసూదన్ రెడ్డి నగరపాలక కమిషనర్ జాన్ శాంసన్ నిజామాబాద్ ఆర్డీవో వెంకటేశ్వర్లు సర్వే ల్యాండ్ రికార్డు ఏడీ కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్​ నిర్మాణ పనులు పరిశీలించిన పాలనాధికారి

ABOUT THE AUTHOR

...view details