నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని జిల్లా ఆస్పత్రిని కలెక్టర్ నారాయణ రెడ్డి తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని రోగులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సూపరిండెంట్ అన్నపూర్ణ.. ఆస్పత్రిలోని అన్ని విభాగాలు, వాటిలో కావాల్సిన మరమ్మతులను కలెక్టర్‌కు చూపించారు.
ఆరోగ్య శ్రీ పథకం కింద ఎక్కువ వైద్యం చేయండి: కలెక్టర్ - నిజామాబాద్ జిల్లా బోధన్ ఆస్పత్రి
బోధన్‌లోని జిల్లా ఆస్పత్రిని కలెక్టర్ నారాయణ రెడ్డి తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరోగ్య శ్రీ పథకాలను ఎంత ఎక్కువగా నిర్వహిస్తే అంతగా సర్కారు నుంచి నిధులు వస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఆరోగ్య శ్రీ పథకం కింద ఎక్కువ వైద్యం చేయండి: నిజామాబాద్ కలెక్టర్
ప్రైవేట్ ఆస్పత్రిలో మాదిరిగా ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఆరోగ్యశ్రీ పథకాలను ఎంత ఎక్కువగా నిర్వహిస్తే అంతగా ప్రభుత్వం నుంచి నిధులు సమకూరుతాయని కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. బోధన్ ఆసుపత్రిని జిల్లా ఆస్పత్రిగా ప్రభుత్వం గుర్తించిందని దానికి తగ్గట్టుగా స్థలం సేకరించి కొత్త భవన నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు.
ఇవీ చూడండి:వనం నుంచి జనం మధ్యకు