తెలంగాణ

telangana

ETV Bharat / state

'సరిహద్దుల వద్ద లాక్​డౌన్ కఠినంగా అమలు చేయాలి' - nizamabad collector visit salura checkpost

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలుర అంతర్రాష్ట్ర చెక్​పోస్ట్​ను జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పరిశీలించారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు... ఆయా జిల్లాల కలెక్టర్ల అనుమతి పత్రం ఉంటేనే అనుమతించాలన్నారు.

nizamabad district latest news
nizamabad district latest news

By

Published : May 5, 2020, 4:38 PM IST

లాక్​డౌన్ నిబంధనలు అందరూ పాటించే విధంగా అధికారులు పని చేయాలన్నారు నిజామాబాద్​ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి. బోధన్ మండలం సాలుర చెక్​పోస్ట్​ను పరిశీలించి... భారీ పోలీస్ బందోబస్తుతో లాక్​డౌన్​ను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. మహారాష్ట్ర ,ఆంధ్రప్రదేశ్,గుజరాత్ రాష్ట్రాలకు చెందిన వాహనాలు ఎట్టిపరిస్థితుల్లోనూ జిల్లాలోకి అనుమతించరాదని స్పష్టం చేశారు.

వ్యవసాయనికి సంబంధించిన మరియు నిత్యావసర సరకులు తీసుకోచ్చే వాహనాలను పరిశీలించి అనుమతించాలన్నారు. విధుల్లో ఉండే అధికారులు, పోలీసులు, వైద్య సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు, సానిటైజర్లు వాడాలని సూచించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details