రూర్బన్ పథకం పనులు వేగవంతం చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం తన కార్యాలయంలో పథకం పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమోదం పొందిన అన్ని పనులు మార్చి నెల 2021లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికీ మొదలు కాని పనులను వారంలోగా ప్రారంభించాలని సూచించారు.
రూర్బన్ పథకం పురోగతిపై కలెక్టర్ సమీక్ష - telangana news
నిజామాబాద్ జిల్లా పాలనాధికారి సి.నారాయణ రెడ్డి రూర్బన్ పథకం పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆమోదం పొందిన అన్ని పనులను మార్చి నెల 2021లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. స్థలం సమస్యలను వారంలోగా పరిష్కరించాలని సూచించారు.

రూర్బన్ పథకం పురోగతిపై కలెక్టర్ సమీక్ష
వచ్చే ఏడాది మార్చిలోపు పూర్తయిన పనులకు మాత్రమే నిధులు విడుదల చేస్తామన్నారు. అనుమతించిన పనులకు స్థలం సమస్య ఉంటే వాటిని వారంలోగా పరిష్కరించాలని బోధన్ ఆర్డీఓ, ఎడపల్లి తహసీల్దార్, ఎంపీడీఓను కలెక్టర్ ఆదేశించారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీఓ శ్రీనివాస్, డీఏఓ గోవింద్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మిధానిలో ముగిసిన మిడ్ కెరీర్ శిక్షణా కార్యక్రమం
TAGGED:
రూర్బన్ పథకం వార్తలు