జ్యోతిరావు పూలే గొప్ప సంఘ సంస్కర్త, తత్వవేత్త, స్త్రీ విద్యా కారకుడని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. మహాత్మ జ్యోతిరావు పూలే 195వ జయంతిని పురస్కరించుకుని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో జయంతోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, నగర మేయర్ నీతూ కిరణ్, మున్సిపల్ కమిషనర్ జితేష్ పాల్గొని నివాళులు అర్పించారు.
జ్యోతిరావు పూలే చిత్రపటానికి కలెక్టర్ నివాళి - జ్యోతిరావు పూలే జయంతి
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. బాల్య వివాహాల నివారణకు, మహిళలకు అవగాహన కల్పించి వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దిన గొప్పమనిషి జ్యోతిరావు పూలే అని కలెక్టర్ పేర్కొన్నారు.
జ్యోతిరావు పూలే చిత్రపటానికి కలెక్టర్ నివాళి
బాల్య వివాహాల నివారణకు, మహిళలకు అవగాహన కల్పించి వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దిన గొప్పమనిషి జ్యోతిరావు పూలే అని కలెక్టర్ అభివర్ణించారు. అణగారిన కులాల అభ్యున్నతికి, స్త్రీ జనోద్ధరణకు విశేష సేవలు చేశారని వెల్లడించారు.
ఇదీ చూడండి:పూలే ఆశయసాధనకు అందరూ కృషి చేయాలి: మంత్రి ఇంద్రకరణ్