తెలంగాణ

telangana

ETV Bharat / state

మెండోరా మండలంలో కలెక్టర్​ విస్తృత పర్యటన - nizamabad news

నిజామాబాద్​ జిల్లా మెండోరా మండలంలో కలెక్టర్​ సి.నారాయణరెడ్డి పర్యటించారు. ఆయా గ్రామాల్లో చేపట్టిన వైకుంఠధామం, రైతుల వేదిక భవనాలు, ప్రకృతి వనాలను పరిశీలించారు. నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

nizamabad collector narayanareddy visited in medora mandal
nizamabad collector narayanareddy visited in medora mandal

By

Published : Sep 4, 2020, 3:27 PM IST

నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలో పాలనాధికారి సి.నారాయణరెడ్డి విస్తృతంగా పర్యటించారు. మొదటగా మెండోరా మండల కేంద్రంలో పర్యటించి.. రైతు వేదిక, ప్రకృతి వనం, వైకుంఠధామం నిర్మాణ పనులను పర్యవేక్షించారు. పార్కులు, వైకుంఠ ధామాలు... మిగతా గ్రామాలకు ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దాలని కలెక్టర్​ సూచించారు.

అనంతరం బుస్సాపూర్ గ్రామంలోని రైతు వేదిక నిర్మాణం 15 రోజులలో పూర్తి చేయాలని గుత్తేదారుకు సూచించారు. పార్కు కోసం స్థలసేకరణ పూర్తి చేసి నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details