నిజామాబాద్ గ్రామీణ మండలంలోని గుండారం గ్రామ శివారులో ప్రభుత్వ అధికారులతో కలిసి కలెక్టర్ సి. నారాయణరెడ్డి పర్యటించారు. అనంతరం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. ఆ విషయాలపై అధికారులతో చర్చించారు.
Collector narayanareddy: స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కోసం స్థల పరిశీలన - స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కొరకు కలెక్టర్ స్థల పరిశీలన
నిజామాబాజ్ జిల్లా గుండారంలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కోసం ప్రభుత్వ స్థలాన్ని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.
స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కొరకు స్థల పరిశీలన
స్థలానికి రోడ్డు కనెక్టివిటీతో పాటు ఇతర సదుపాయాలు, స్థల విస్తీర్ణం, స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుకు ఇతర సదుపాయాలపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీఓ రవి, తహసీల్దార్ ప్రశాంత్, ఎంఆర్ఐ భూపతి ప్రభు సంబంధిత అధికారులు ఉన్నారు.
ఇదీ చూడండి:పోలీసులకు ఓ శునకం విన్నపం.. ఏంటంటే?