నిజామాబాద్ నూతన సమీకృత కలెక్టరేట్లో సీసీ కెమెరాల మానిటరింగ్ గదులను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. కలెక్టర్ ఛాంబర్, కాన్ఫరెన్స్ హాల్, అడిషనల్ కలెక్టర్ గదులు, నేమ్ బోర్డ్స్ ఆయన తనిఖీ చేశారు.
'పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయండి' - నిజామాబాద్‌లో నూతన కలెక్టరేట్
కలెక్టరేట్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. నూతనంగా నిర్మిస్తున్న సమీకృత భవనాల్లో సీసీ కెమెరాల మానిటరింగ్, ప్లాంటింగ్ పనులను ఆయన పరిశీలించారు.
నిజామాబాద్ నూతన కలెక్టరేట్‌ను పరిశీలించిన జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి
కొత్తగా నిర్మిస్తున్న కలెక్టరేట్లో జరుగుతున్న అన్ని పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. చిన్న చిన్న పనులను కూడా పెండింగ్‌లో లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం జరుగుతున్న ప్లాంటింగ్ కార్యక్రమాన్ని పరిశీలించారు. కలెక్టరేట్ ఆవరణలో పచ్చదనంతో కనిపించే విధంగా మొక్కలు నాటాలని జిల్లా పాలనాధికారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీపీఓ జయసుధ, ఎంపీడీవో సురేందర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.