నీటి పారుదల శాఖకు చెందిన భూములు, ట్యాంకుల వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేయాలని పాలనాధికారి నారాయణరెడ్డి తెలిపారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. భూముల వివరాలు సర్వే చేసి మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
'నీటి పారుదల శాఖ భూములు ధరణి పోర్టల్‌లో నమోదు చేయాలి' - నిజామాబాద్ కలెక్ట్ నారాయణ రెడ్టి
జిల్లాలోని అన్ని మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల వివరాలను పూర్తి నీటి మట్టం వరకు సేకరించి ధరణి పోర్టల్‌లో నమోదు చేయాలని నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. నీటి పారుదల శాఖకు చెందిన భూమలు వివరాలు సైతం నమోదు చేయాలని ఆదేశించారు.
!['నీటి పారుదల శాఖ భూములు ధరణి పోర్టల్‌లో నమోదు చేయాలి' nizamabad collector narayana reddy video conference with officials](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10862292-745-10862292-1614827195919.jpg)
'నీటి పారుదల శాఖ భూములు ధరణి పోర్టల్‌లో నమోదు చేయాలి'
30 చెక్‌డ్యామ్‌ల నిర్మాణ పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని పేర్కొన్నారు. వాటికి అవసరమైన ఇసుకను ఆర్డీవోలు సరఫరా చేయాలన్నారు. ఈఈలు అశోక్‌కుమార్, భాను ప్రకాష్, భూగర్భ గనుల శాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి:జోరుగా వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు