తెలంగాణ

telangana

By

Published : Nov 14, 2020, 11:28 AM IST

ETV Bharat / state

పంట రుణాలపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

రైతులు రుణాలపై కలెక్టర్ నారాయణ రెడ్డి సమీక్షించారు. రైతులు ముందుకు రావడం లేదని బ్యాంకర్లు తెలపగా... అన్నదాతలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులందరూ రుణాలు పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

nizamabad collector narayana reddy review on crop loans
రైతులకు పంట రుణాలపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

వ్యవసాయ, రెవెన్యూ, ఉద్యానవన శాఖలతో కలిసి పంట రుణాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. అర్హత ఉన్న రైతులందరూ రుణాలు పొందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిజామాబాద్ కలెక్టరేట్​లో జరిగిన డీఎల్​ఆర్సీ సమావేశంలో అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.

వానాకాలంలో కేవలం 4శాతం, యాసంగిలో అక్టోబర్ వరకు కేవలం 7.74 శాతం మాత్రమే రైతులు రుణాలు పొందారని తెలిపారు. రుణాలు తక్కువగా తీసుకోవడానికి కారణాలను విశ్లేషించగా రైతులు ముందుకు రావడం లేదని బ్యాంకర్స్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ గ్రామాల్లో రైతులు ముందుకు రావడం లేదో వారు రుణాలు పొందేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ జితేష్ వి. పాటిల్, ఎల్​డీఎం జయ సంతోషి, నాబార్డ్ డీడీఎం నగేష్, ఎస్బీఐ ఆర్ యమ్ ప్రతాప్ రెడ్డి, ఆర్ సెటీ డైరెక్టర్ సుధీంద్ర బాబు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:'అందమైన నగరంగా నిజామాబాద్​ని తీర్చిదిద్దుతున్నాం'

ABOUT THE AUTHOR

...view details