నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మాధవనగర్లోని లయన్స్ క్లబ్ భవనాన్ని కరోనా వార్డుగా మార్చేందుకు అనుమతిచ్చిన క్లబ్ ప్రతినిధులను కలెక్టర్ నారాయణరెడ్డి అభినందించారు. జడ్పీ ఛైర్మన్ విఠల్ రావుతో కలిసి కరోనా వార్డును పరిశీలించారు.
'కరోనా సోకిన వారు భయాందోళనకు గురికావద్దు' - collector inspected corona ward in nizamabad
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మాధవనగర్ లయన్స్ క్లబ్ భవనంలో ఏర్పాటు చేసిన కరోనా వార్డును కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. సరైన చికిత్సతో కరోనా నుంచి బయటపడగలమని, వైరస్ బారిన పడిన వారెవరూ భయాందోళనకు గురికావొద్దని సూచించారు.
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
కరోనా బారిన పడినవారెవరూ అనవసరంగా ఆందోళన చెందవద్దని, వైద్యుల సహకారంతో వ్యాధి నుంచి కోలుకోవచ్చని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, లయన్స్ క్లబ్ ఛైర్మన్ వీరేశం, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.