కరోనా వ్యాప్తి అధికమవడంతో కలెక్టరేట్లలో ప్రతి సోమవారం నిర్వహించే కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టారు. నిజామాబాద్ జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి సమక్షంలో తన కార్యాలయం బయటే టెంటు వేసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కొవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
కొవిడ్ తెచ్చిన మార్పు... ఆరుబయటే ప్రజావాణి - కలెక్టరేట్లో ఆరుబయటే ప్రజావాణి
కొవిడ్ విజృంభణతో కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఆరుబయటే నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో వైరస్ వ్యాప్తి ఆందోళనకరంగా మారడంతో జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి వినూత్న ఆలోచనతో చేపట్టారు.
నిజామాబాద్ కలెక్టరేట్లో బయటే ప్రజావాణి నిర్వహిస్తున్న కలెక్టర్ నారాయణరెడ్డి
రెవెన్యూ, పంచాయతీరాజ్, డీఆర్డీఏ, మున్సిపల్ శాఖల అధికారులతో ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజలు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించేలా పోలీసులు, కలెక్టరేట్ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. ప్రజావాణి రద్దు చేసినప్పటికీ.... ఫిర్యాదుదారులు వస్తున్నారని... అందుకే ఆరుబయటే కార్యక్రమానికి ఏర్పాటు చేసినట్లు కలెక్టరేట్ సిబ్బంది పేర్కొన్నారు.