నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రతి 1000 మంది జనాభాకు ఒక మెడికల్ టీమ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని మండలాల అధికారులు, పీఎహెచ్సీ, సీహెచ్సీ, యూపీహెచ్సీల వైద్యాధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో సూచనలు, సలహాలు, నియమనిబంధనలపై అధికారులతో చర్చించారు.
'ప్రతి 1000 మంది జనాభాకు ఒక మెడికల్ టీమ్ ఉండాలి' - collector narayan reddy meeting with medical officers
ప్రజారోగ్యం దృష్ట్యా నిజామాబాద్ జిల్లా వైద్యాధికారులతో కలెక్టర్ నారాయణ రెడ్డి దూరదృశ్య మాధ్యమం ద్వారా సమావేశం నిర్వహించారు. కరోనా తీవ్రత దృష్ట్యా జిల్లాలోని ప్రతి గ్రామంలో ప్రత్యేక వైద్య సిబ్బంది పర్యటించి ప్రజలకు సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.
వైద్యాధికారులతో కలెక్టర్ నారాయణ రెడ్డి సమావేశం
రేపటి నుంచి ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఆరోగ్య కేంద్రాల వద్ద మెడికల్ క్యాంప్ నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఓపీ సేవలు అందించాలని పేర్కొన్నారు. గ్రామాల్లోని ఇంటింటినీ మెడికల్ సిబ్బంది పర్యటించి ప్రజల యోగ క్షేమాలు తెలుసుకోవాలన్నారు. కరోనా కానీ, ఇతర అనారోగ్య సమస్యలేవైనా ఉంటే మందులు అందజేయాలని చెప్పారు.
ఇదీ చదవండి:మహమ్మారితో పోరాడుతున్న పోలీసులు, వైద్యులు