తెలంగాణ

telangana

ETV Bharat / state

సమాజ హితానికి కట్టుబడి పనిచేయండి: కలెక్టర్ - నిజామాబాద్‌ లో దీక్షంత్‌ పరేడ్‌లో పాల్గొన్న కలెక్టర్‌ నారాయణ రెడ్డి

నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండల కేంద్రంలోని 7వ బెటాలియన్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్‌సీటీపీసీ/ ఏఆర్‌ కానిస్టేబుల్స్‌ దీక్షంత్‌‌ కవాత్‌కు కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరోనా సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లకు కలెక్టర్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతిజ్ఞని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నట్టు తెలిపారు.

nizamabad collector narayan reddy in 7th batallion dikshanth parade
సమాజానికి సేవలు అందిస్తారని ఆశిస్తున్నా: కలెక్టర్‌ నారాయణ రెడ్డి

By

Published : Oct 8, 2020, 1:27 PM IST

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని 7వ బెటాలియన్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్‌సీటీపీసీ/ ఏఆర్‌ కానిస్టేబుల్స్ దీక్షిత్ కవాత్‌కు ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి హాజరయ్యారు. కరోనా సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా 13 వ బ్యాచ్‌లో 9 నెలల శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరిన 347 మంది కానిస్టేబుళ్లకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

పరిపాలనకు పోలీసు శాఖ గుండె కాయ వంటిదనీ, కఠోర శిక్షణ తర్వాత సమాజానికి సేవలు అందించబోతున్నారని కానిస్టేబుళ్లను ఉద్దేశించి కలెక్టర్‌ అన్నారు. తప్పకుండా మంచి సర్వీసు అందిస్తారని, సమాజానికి మంచి చేయాలనే తపన, ప్రతిజ్ఞని పదవీ విరమణ వరకు నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏడవ బెటాలియన్ కమాండెంట్ ఎన్‌.వి సత్య శ్రీనివాస్, బెటాలియన్‌కు సంబంధించిన ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:క్రియాశీలకం కానున్న కృష్ణా యాజమాన్య మండలి

ABOUT THE AUTHOR

...view details