నిజామాబాద్ నగరం చంద్రశేఖర్ కాలనీలోని అర్బన్ హెల్త్ సెంటర్లో గర్భిణులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు మేయర్ దండు నీతూ కిరణ్ మాస్కులు అందించారు. కరోనా వ్యాధి రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
'జాగ్రత్తలు పాటించాలి.. అత్యవసరం అయితేనే బయటికి రావాలి' - Nizamabad city Mayor Dandu Neetu Kiran distributes Masks
కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ సూచించారు. ఈ సందర్భంగా గర్భిణులకు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు మాస్కులను పంపిణీ చేశారు.
Breaking News
అత్యవసర పనులుంటే తప్ప బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలందరూ భౌతికదూరం పాటిస్తూ... వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో నగర కమిషనర్ జితేష్, డీఎంహెచ్ఓ డాక్టర్ సుదర్శనం పాల్గొన్నారు.
TAGGED:
గర్భిణులకు మాస్కుల పంపిణీ