రాష్ట్ర ప్రభుత్వం, వైద్యాధికారులు.. ఆశాలను ఒత్తిడి చేయడం మానుకోవాలని నిజామాబాద్ సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ సూచించారు. వర్కర్లకు స్మార్ట్ఫోన్లు ఇవ్వకుండా.. సర్వే చేయమనడం సరైంది కాదన్నారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. నగరంలోని కార్యాలయంలో జిల్లాకు చెందిన ఆశా వర్కర్లతో సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ పనులకు సంబంధించిన మెటీరియల్ను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని నూర్జహాన్ పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు.