ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కకపోవడం వల్ల నిజామాబాద్ కార్పొరేషన్లో హంగ్ ఏర్పడింది. 60 డివిజన్లున్న నగరంలో భాజపా 28 స్థానాల్లో గెలిచి మొదటి స్థానంలో నిలిచింది. 16 స్థానాల్లో గెలిచిన ఎంఐఎం రెండో స్థానంలో నిలిచింది. తెరాస 13 స్థానాలతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్‌కు రెండు స్థానాలు, ఇతరులకు ఒక స్థానం దక్కింది.
ఇందూరు కార్పొరేషన్లో ఏ పార్టీకి దక్కని ఆధిక్యం - nizamabad carporation
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. మొత్తం 60 డివిజన్లు ఉన్న నగరంలో 28 డివిజన్లు భాజపా జయకేతనం ఎగురవేసింది. 16 స్థానాలు గెలుచుకున్న ఎంఐఎం రెండో స్థానంలో నిలవగా, 13 స్థానాలతో తెరాస మూడో స్థానంతో సరిపెట్టుకుంది.
ఇందూరు కార్పొరేషన్లో ఏపార్టీకి దక్కని పూర్తి ఆధిక్యం
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి తెరాస, ఎంఐఎం కూటమికి దక్కడంపై సంగ్దితత నెలకొంది. మేయర్ పదవిపై చిక్కుముడి పడింది. మేయర్ పదవి తెరాసకు ఇస్తుందా... ఎంఐఎంనే మేయర్ పదవి చేజిక్కించుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఆసక్తిగా సాగిన పోరులో గతంలో మాదిరిగానే ఎంఐఎంతో కలిసి తెరాస కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకుంటుందా... ఇతరులతో పొత్తు కుదుర్చుకుని ఛైర్మన్ పీఠాన్ని భాజపా దక్కించుకుంటుందా తేలాల్సి ఉంది.
భాజపా | ఎంఐఎం | తెరాస | కాంగ్రెస్ | ఇతరులు | మొత్తం |
28 | 16 | 13 | 02 | 01 | 60 |