నిజామాబాద్ జిల్లా భాజపా(BJP) అధ్యక్షులు బస్వా లక్ష్మీనర్సయ్య నిత్యావసరాలు పంపిణీ చేశారు. 22 డివిజన్లో కరోనాతో మృతి చెందిన 6 కుటుంబాలకు బియ్యం, కిరాణా సరకులు అందించారు. 26వ డివిజన్లో మున్సిపల్ కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ(NDA) ప్రభుత్వం విజయవంతంగా ఏడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా పార్టీ పిలుపు మేరకు సేవా హీ సంఘటన్ కార్యక్రమంలో భాగంగా నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.
BJP: భాజపా ఆధ్వర్యంలో సరకుల పంపిణీ - నిజామాబాద్ జిల్లా వార్తలు
నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ(NDA) ప్రభుత్వం విజయవంతంగా ఏడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా నిజామాబాద్ జిల్లా భాజపా(BJP) అధ్యక్షులు బస్వా లక్ష్మీనర్సయ్య నిత్యావసరాలు పంపిణీ చేశారు. 22 డివిజన్లో కరోనాతో మృతి చెందిన 6 కుటుంబాలకు బియ్యం, కిరాణా సరకులు అందించారు.
BJP: భాజపా ఆధ్వర్యంలో సరకుల పంపిణీ
ఈ ఏడేళ్ల కాలంలో మోదీ సాహసోపేత నిర్ణయాలతో, అద్భత సంస్కరణలతో సుపరిపాలన అందిస్తున్నారుని అన్నారు. ఈ కార్యక్రమంలో బంటు వైష్ణవి, పంచారెడ్డి లింగం పాల్గోన్నారు.
ఇదీ చదవండి:Eatala: ఒక్క ఎకరం ఎక్కువ ఉన్నా ముక్కు నేలకు రాస్తా: ఈటల సతీమణి