ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా విద్యుత్ బిల్లుల భారం మోపడాన్ని నిరసిస్తూ భాజపా రాష్ట్ర కమిటీ ఆందోళనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయం ఎదుట భాజపా నేతలు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాజపా నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు.
'గుడిసెలకూ వేలల్లో బిల్లులు వేసిన ఘనత కేసీఆర్ సొంతం' - విద్యుత్ కార్యాలయం ఎదుట భాజపా నేతల ఆందోళన
గుడిసెల్లో నివసించే వాళ్లకు కూడా వేల రూపాలల్లో విద్యుత్ బిల్లులు వేయడం సరికాదని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. నిజామాబాద్లో భాజపా ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు.

విద్యుత్ కార్యాలయం ఎదుట భాజపా నేతల ఆందోళన
ప్రభుత్వ విధానాలతో ప్రజలపై భారం మోపడం సమంజసం కాదని మండిపడ్డారు. సాంకేతికత, స్లాబ్‌లను సాకులుగా చూపుతూ జనం జేబులకు చిల్లులు పెట్టడం ప్రభుత్వం మానుకోవాలన్నారు. అధికారులు కూడా ప్రజలను తప్పుదోవపట్టించి, బిల్లులు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.