ఒక్క ఏడాదిలోనే మాజీ ఎంపీ కవిత ఆస్తి విలువ పది కోట్లు పెరిగిందని నిజామాబాద్ జిల్లా భాజపా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య ఆరోపించారు. 2019 లోక్ సభ సాధారణ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన కవిత ఎన్నికల సంఘానికి తన ఆస్తుల విలువ రూ.17 కోట్లు వున్నట్లుగా పేర్కొన్నారు. ఇప్పుడు నిజామాబాద్ స్థానిక సంస్థల కోటలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం రూ. 27 కోట్లుగా చూపించారని లక్ష్మీనర్సయ్య వివరించారు.
'ఏడాదిలో పది కోట్లు.. కవితకు ఎలా సాధ్యమైంది?' - mlc election nominations
మాజీ ఎంపీ కవిత ఆస్తులపై నిజామాబాద్ జిల్లా భాజపా అధ్యక్షుడు పలు ఆరోపణలు చేశారు. ఒక్క ఏడాదిలోపే పది కోట్ల ఆస్తి ఎలా సంపాదించగలిగారో తెలపాలని ప్రశ్నించారు.
'ఒక్క ఏడాదిలో పది కోట్లు సంపాదించటం కవితకు ఎలా సాధ్యం'
కేవలం ఒక్క ఏడాది లోపే పది కోట్ల ఆస్తులు సంపాదించడం ఎలా సాధ్యమైందని ప్రశ్నిచారు. అఫిడవిట్లో చూపిన ఆస్తుల వివరాలు ప్రభుత్వ విలువ కంటే కూడా తక్కువగా చూపించారని ఆరోపించారు. ఎన్నికల సంఘం స్పందించి కవితపై కఠిన చర్యలు తీసుకొని ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.