తెలంగాణ విమోచన్న దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిజామాబాద్ జిల్లా భాజపా నేతలు డిమాండ్ చేశారు. నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ సంస్థాన్‌లో ఉన్న తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు సెప్టెంబర్ 17న విముక్తి పొందాయని తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకుంటున్నాయని, తెలంగాణలో మాత్రం కేసీఆర్ సర్కార్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడం లేదని మండిపడ్డారు.
'తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి' - Telangana Liberation Day on september seventeenth
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిజామాబాద్ జిల్లా భాజపా నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ నారాయణరెడ్డికి వినతి పత్రం సమర్పించారు.
కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసిన నిజామాబాద్ జిల్లా భాజపా నేతలు
తెలంగాణలోనూ సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని కోరుతూ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి భాజపా నేతలు వినతి పత్రం సమర్పించారు.
ఇదీ చూడండి:పీవీకి భారతరత్న తీర్మానం సమయంలో సభలో స్వల్ప సంవాదం
TAGGED:
తెలంగాణ విమోచన దినోత్సవం