MP Arvind Counter To Kavitha: ముఖ్యమంత్రి బిడ్డగా ఐదేళ్లలో రైతులకు చేసింది శూన్యమని నిజామాబాద్ భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. తాను ఎంపీ అయినా మూడేళ్లలోనే తీసుకొచ్చిన నిధులను ఒక్కసారి చూడాలని హితవు పలికారు. రైతుల సమస్యలు ఉన్నందునే తాను సమాధానం చెబుతున్నాని తెలిపారు. హైస్పీడ్‌లో అబద్ధాలు చెప్పడం తప్ప భాజపా నేతలు చేసిందేమీ లేదని తెరాస ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్‌లో ధ్వజమెత్తారు. ఆమె మాటలకు స్పందించాల్సిన అవసరం లేదని.. రైతుల సమస్య అయినందు వల్లే సమాధానం చెబుతున్నానని తెలిపారు.
ఆమె ఎంపీగా ఐదేళ్లలో పసుపు రైతులకు చేసింది శూన్యం. ఆమెకు గతంలోనే స్పైస్ బోర్డు జవాబిచ్చాక రెండు సార్లు బడ్జెట్ వచ్చింది. మళ్లీ ఒకసారి స్పైస్ బోర్డుకు లేఖ రాయండి. మీకు రిప్లై వస్తుంది. పసుపు రైతుల కోసం ముఖ్యమంత్రి బిడ్డ ఐదేళ్లలో 13 బాయిలర్లు, మూడు పాలిషర్లు, టార్పాలిన్లు సున్నా. తెచ్చింది. మేం మూడేళ్లలో 108 బాయిలర్లు, 209 పాలిషర్లు, టార్పాలిన్లు 7240 తీసుకొచ్చాం.