అర్హులకు డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ.. భాజపా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీనర్సయ్య స్థానికులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. నెల రోజుల్లోగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు.
నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో 50వేల పై చిలుకు దరఖాస్తులు వస్తే.. కేవలం 396 ఇళ్లను నిర్మించారని లక్ష్మీనర్సయ్య గుర్తు చేశారు. నిర్మాణం పుర్తై ఏళ్లు గడుస్తోన్నా.. లబ్ధిదారులను గుర్తించకపోవడం శోచనీయమన్నారు.