కాలుష్య నివారణలో భాగంగా ఆర్యసమాజ్ ఇందూర్ ఆధ్వర్యంలో సంచార యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు నిజామాబాద్ నగరంలో చంద్ర శేఖర్ కాలనీ, కంటేశ్వర్ ప్రాంతాల్లో కాలుష్య నివారణ సంచార వేదార్థము ద్వారా యజ్ఞాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. ప్రస్తుత కాలంలో కాలుష్యం ఏర్పడి, ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, కావున తాము 40 రకాల మూలికలతో ఈ సంచార రథం ద్వారా యజ్ఞాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు.
కాలుష్య నివారణకు ఆర్యసమాజ్ సంచార యజ్ఞ రథం
కాలుష్య నివారణకు ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఇందూర్లో సంచార యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యాన్ని శుద్ధి చేసేందుకే తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆర్యసమాజ్ నిర్వాహకులు తెలిపారు.
కాలుష్య నివారణకు ఆర్యసమాజ్ సంచార యజ్ఞ రథం
వాతావరణ కాలుష్యం ద్వారానే కరోనా వైరస్ లాంటి మహమ్మారిలు పెరిగిపోతున్నాయని అందుకోసం వాతావరణాన్ని శుద్ధి చేసేందుకే ఈకార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. గత మూడు వారాలుగా తాము నగరంలో తిరుగుతూ యజ్ఞ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని భక్తులు దీనికి విజ్ఞప్తి చేశారు.