తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫీవర్​ సర్వేపై అదనపు కలెక్టర్​ చంద్రశేఖర్​ పర్యవేక్షణ - nizamabad additional collector supervised the fever survey in armoor

నిజామాబాద్​ జిల్లా ఆర్మూరు మున్సిపల్​ పరిధిలో జరుగుతున్న ఫీవర్​ సర్వేను అదనపు కలెక్టర్​ చంద్రశేఖర్​ పర్యవేక్షించారు. కాలనీల్లో పర్యటించి వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. కరోనా తీవ్రత దృష్ట్యా నిర్లక్ష్యంగా ఉండవద్దని సూచించారు.

fever survey in armoor
ఆర్మూర్​లో ఫీవర్​ సర్వే

By

Published : May 20, 2021, 5:56 PM IST

ఫీవర్​ సర్వేలో భాగంగా ఆరోగ్య సిబ్బంది బృందానికి థర్మా మీటర్, ఆక్సిమీటర్ అందించి ఇంటింటి సర్వేకు పంపాలని నిజామాబాద్​ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్.. ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 16, 24 వ వార్డుల్లో జరుగుతున్న ఫీవర్​ సర్వేను ఆర్డీవో శ్రీనివాసులు, డిప్యూటీ డీఎంహెచ్ఓ రమేష్​తో కలిసి పర్యవేక్షించారు. ఆరోగ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు.

కాలనీల్లో పర్యటించి ప్రజలను ఏమైనా లక్షణాలు ఉన్నాయా అని అదనపు కలెక్టర్​ అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వారికి అవగాహన కల్పించారు. ప్రజలు నిర్లక్ష్యం వహించొద్దని కోరారు. లక్షణాలు ఉంటే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందాలని సూచించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్​స్పెక్టర్ మహేష్, 24 వ వార్డు కౌన్సిలర్ ఆకుల రాము, ఆరోగ్య కేంద్రం వైద్యురాలు ఆయేషా, తెరాస సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:పీపీఈ కిట్ లేకుండా వెళ్లడం తప్పు: బండి సంజయ్​

ABOUT THE AUTHOR

...view details