తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటింటి సర్వేను పరిశీలించిన అదనపు కలెక్టర్​ లత - నిజామాబాద్​లో ఇంటింటి సర్వే

కరోనా వ్యాప్తి దృష్ట్యా గ్రామాల్లో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్​ లత పరిశీలించారు. అనంతరం బాల్కొండ ప్రభుత్వాస్పత్రిలో కరోనా టెస్టులు, వ్యాక్సినేషన్​ తీరును వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

nizamabad additional collector latha observed survey on corona
ఇంటింటి సర్వేను పరిశీలించిన అదనపు కలెక్టర్ లత

By

Published : May 9, 2021, 8:18 AM IST

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలంలోని వన్నెల్‌(బి), మెండోరా మండలం బుస్సాపూర్‌లో అదనపు కలెక్టర్‌ లత శనివారం పర్యటించారు. కొవిడ్​ నేపథ్యంలో గ్రామాల్లో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను ఆమె పరిశీలించారు. అనంతరం బాల్కొండలోని ప్రభుత్వాస్పత్రిని సందర్శించి కరోనా నిర్ధరణ పరీక్షలు, వ్యాక్సినేషన్‌ తీరును వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

కొవిడ్‌ లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ మందులు అందజేయాలని అదనపు కలెక్టర్​ సూచించారు. బాధితులు త్వరగా కోలుకునే విధంగా తరచుగా కౌన్సిలింగ్‌ ఇవ్వాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సంతోష్‌కుమార్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి:దేవరయాంజాల్‌లో తాత్కాలికంగా నిలిచిన భూ సర్వే

ABOUT THE AUTHOR

...view details