తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​కు చేరిన 'నిజాం షుగర్' కార్మికుల పాదయాత్ర - నిజాం షుగర్ కార్మికుల పాదయాత్ర

బోధన్​లోని నిజాం షుగర్ కంపెనీని నమ్ముకుని జీవిస్తున్న కార్మికులు.. ఐదేళ్ల నుంచి అర్ధాకలితో అలమటిస్తున్నారు. సంస్థ మూతపడి.. జీవితాలు రోడ్డున పడటంతో అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కంపెనీను పునః ప్రారంభించాలని డిమాండ్​ చేస్తూ.. పాదయాత్రతో రాష్ట్ర రాజధానికి చేరుకున్నారు.

హైదరాబాద్​కు చేరుకున్న 'నిజాం షుగర్' కార్మికుల పాదయాత్ర
హైదరాబాద్​కు చేరుకున్న 'నిజాం షుగర్' కార్మికుల పాదయాత్ర

By

Published : Feb 18, 2021, 12:04 PM IST

మూతపడిన నిజాం షుగర్ కంపెనీని తెరిపించాలని డిమాండ్​ చేస్తూ నిజామాబాద్ నుంచి.. కార్మికులు చేపట్టిన పాదయాత్ర హైదరాబాద్​కు చేరుకుంది. కుటుంబాన్ని వదిలేసి, పొట్ట చేత పట్టుకుని.. వర్కర్లు బోధన్ నుంచి సుమారు 200 కి. మీ నడుచుకుంటూ రాష్ట్ర రాజధానికి చేరుకున్నారు.

బోధన్​లోని నిజాం షుగర్ కంపెనీ, డీస్టీలరీ కంపెనీలు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో కొనసాగుతున్నాయి. ఆయా కంపెనీలను అర్ధాంతరంగా మూసి వేయడంతో దాదాపు 300కు పైగా కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయి. 2015 నుంచి వేతనాలు నిలిపివేయడంతో.. ఓ వైపు కుటుంబాన్ని పోషించుకోలేక, మరోవైపు పిల్లలను చదివించుకోలేక వారంతా కన్నీరుమున్నీరవుతున్నారు. ఆడ పిల్లల వివాహాలు జరిపించలేని మరికొందరు.. ఆత్మహత్యలకూ పాల్పడినట్లు సమాచారం.

ఎన్నికల సమయంలో ఆదుకుంటానని చెప్పిన సీఎం.. అనంతరం తమ సమస్యలను గాలికొదిలేశారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి కంపెనీని తెరిపించాలి. 2015 నుంచి పెండింగ్​లో ఉన్న వేతనాలను విడుదల చేయాలి.

- ఉపేందర్, ఫ్యాక్టరీ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి.

ఇదీ చదవండి:'న్యాయవాద దంపతుల హత్యలో తెరాస నేతల ప్రమేయం'

ABOUT THE AUTHOR

...view details