తెలంగాణ

telangana

ETV Bharat / state

"ఒలింపిక్స్​లోనూ రాణించటమే నిఖత్‌ ప్రధాన లక్ష్యం"

Nikhat Zareen Father Interview: 11ఏళ్ల నిఖత్‌ కఠోర దీక్షా ఫలితమే ఇవాళ ఆమెను విశ్వవిజేతగా నిలిపిందని.. ఒలింపిక్స్‌లో రాణించడమే తన భవిష్యత్‌ లక్ష్యమని నిఖత్‌ జరీన్‌ తండ్రి జమీల్‌ అహ్మద్‌ తెలిపారు. విశ్వ వేదికపై తన కుమార్తె విజేతగా నిలవటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​, ఎమ్మెల్సీ కవిత ఇచ్చిన ప్రోత్సాహంతోనే తమ బిడ్డ పసిడిని ముద్దాడినట్లు ఆయన పేర్కొన్నారు. నిఖత్‌ జరీన్‌ ఒలింపిక్స్‌లో రాణించేందుకు ప్రభుత్వం ఆమెకు అన్ని విధాలుగా సహకరించాలని జమీల్‌ కోరారు. ఆడపిల్లలనే ఆలోచనను వదిలి వారు క్రీడల్లో రాణించేందుకు తల్లిదండ్రులు ప్రోత్సాహం అందించాలంటున్న జమీల్‌ అహ్మద్‌తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

"ఒలింపిక్స్​లోనూ రాణించటమే నిఖత్‌ ప్రధాన లక్ష్యం"
"ఒలింపిక్స్​లోనూ రాణించటమే నిఖత్‌ ప్రధాన లక్ష్యం"

By

Published : May 20, 2022, 2:06 AM IST

"తన 25 ఏళ్ల కల నిజమైంది. ఈ స్థాయికి చేరుకునేందుకు నిఖత్​ తీవ్రంగా కృషి చేసింది. నిఖత్ బాక్సింగ్​లో రాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలిచింది. భవిష్యత్తులో ఒలింపిక్స్​లో మెడల్ సాధించి తెలంగాణకు పేరు తీసుకురావడమే లక్ష్యం. అందుకోసం ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరించాలి. సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్సీ కవిత ఎంతో ప్రోత్సాహమిచ్చారు. గోల్కొండ వేదికగా నిఖత్‌కు సీఎం కేసీఆర్‌ మాటిచ్చారు. బాక్సింగ్‌లో రాణించేందుకు పూర్తిమద్దతునిస్తామని చెప్పారు. వారిచ్చిన ప్రోత్సాహంతోనే నిఖత్‌ స్వర్ణపతకం గెలిచింది. 11 ఏళ్లుగా నిఖత్‌ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. బాక్సింగ్‌ శిక్షణకు వెళ్లినప్పుడు అక్కడ అమ్మాయిలు ఉండేవారు కాదు. తాము కొంత ఇబ్బంది పడ్డా... నిఖత్‌ ధైర్యంగా ముందడుగు వేసింది. క్రీడల్లో రాణించేలా పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలి." -జమీల్‌ అహ్మద్‌, నిఖత్‌ జరీన్‌ తండ్రి

"ఒలింపిక్స్​లోనూ రాణించటమే నిఖత్‌ ప్రధాన లక్ష్యం"

ABOUT THE AUTHOR

...view details