రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని నిజామాబాద్ నగర గంగపుత్ర సంఘం అధ్యక్షుడు పల్లికొండ అన్నయ్య గంగపుత్ర డిమాండ్ చేశారు. చేపలు పట్టడం ముదిరాజ్‌ల వృత్తేనన్న మంత్రి వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
'మత్స్యశాఖ మంత్రికి గంగపుత్రుల కులవృత్తి ఏమిటో తెలియదా?' - ganganputra demond for removing minister
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గంగపుత్రుల కుల వృత్తిని ఇతరులకు ఎందుకు ధారాదత్తం చేస్తున్నారో చెప్పాలని నిజామాబాద్ నగర గంగపుత్ర సంఘం అధ్యక్షుడు పల్లికొండ అన్నయ్య గంగపుత్ర ప్రశ్నించారు. చేపలు పట్టడం ముదిరాజ్‌ల వృత్తేనన్న మంత్రి వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
తమ హక్కుల సాధనకు గంగపుత్రులు ఏకం కావాలని అన్నయ్య పిలుపునిచ్చారు. మత్స్య శాఖ మంత్రికి గంగపుత్రుల కుల వృత్తి ఏమిటో తెలియనప్పుడు ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు ఆ బాధ్యత అప్పగించి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమ కుల వృత్తిని ఇతరులకు ఎందుకు ధారాదత్తం చేస్తున్నారో చెప్పాలంటూ ప్రశ్నించారు. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో హైదరాబాద్‌లో ఉన్న 10 లక్షల మంది గంగపుత్రులంతా కలిసి మంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర గంగపుత్ర సంఘం కార్యనిర్వహక అధ్యక్షుడు వినోద్ గంగపుత్ర, ఉపాధ్యక్షుడు జుంబర్తి రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:భాజపా.. మతం పేరుతో రెచ్చగొడుతోంది: మంత్రి ఎర్రబెల్లి