సైకిల్ మోటార్ ఢీకొని గాయపడిన ఓ వ్యక్తిని నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి డీపీఆర్ వాహనంలో జిల్లా ఆసుపత్రికి తరలించారు.
మానవత్వాన్ని చాటుకున్న జిల్లా కలెక్టర్ - నిజామాబాద్ తాజా వార్తలు
ప్రమాదవశాత్తు గాయపడిన ఓ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ తమ మానవత్వాన్ని చాటుకున్నారు. బాధితున్ని డీపీఆర్ వాహనంలో చికిత్సకోసం పంపించారు.
మానవత్వాన్ని చాటుకున్న జిల్లా కలెక్టర్
జిల్లాలోని రుద్రూర్ గ్రామానికి చెందిన సాయిలు ఓ మోటారు సైకిల్ ఢీకొని గాయపడ్డాడు. ఈ క్రమంలో జాతీయ ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించడానికి వచ్చిన కేంద్ర బృందం పర్యటనలో భాగంగా మల్లారం అటవీ ప్రాంతానికి వెళ్తోన్న కలెక్టర్ బాధితున్ని గమనించారు. వెంటనే చికిత్స కోసం అతన్ని డీపీఆర్ వాహనంలో జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:ఫిట్‌మెంట్ 43 శాతం కంటే తగ్గకుండా ఇవ్వాలి : ఉద్యోగ సంఘాలు