తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా మహమ్మారి నుంచి ప్రజల్ని కాపాడు తల్లీ!' - Navaratri celebrations in Nizamabad

కరోనా మహమ్మారి నుంచి కాపాడాలంటూ నిజామాబాద్ మేయర్ నీతూకిరణ్ దుర్గామాతను వేడుకున్నారు. నగరంలోని ఎల్లమ్మ గుట్ట ప్రాంతంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.

Navaratri celebrations in Nizamabad
నిజామాబాద్ మేయర్ నీతూకిరణ్

By

Published : Oct 22, 2020, 12:21 PM IST

నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ మేయర్ నీతూ కిరణ్ పాల్గొన్నారు. స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.

అనంతరం దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా మహమ్మారి, వరద ముప్పుల నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడాలని కోరుకున్నారు. ప్రతిఏటా ఘనంగా నిర్వహించుకునే బతుకమ్మ పండుగను.. కరోనా వ్యాప్తి వల్ల ఈ ఏడాది నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details