తెలంగాణ

telangana

ETV Bharat / state

PFI కేసులో NIA ఛార్జిషీట్‌.. 11 మందిపై అభియోగాలు

NIA chargesheet in PFI Case : పీఎఫ్‌ఐ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. మొత్తం 11 మందిపై హైదరాబాద్ ప్రత్యేక కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసింది. ఈ కేసులో తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది.

NIA
NIA

By

Published : Dec 30, 2022, 4:36 PM IST

NIA chargesheet in PFI Case : పీఎఫ్‌ఐ కేసులో ఎన్‌ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మొత్తం 11 మందిపై హైదరాబాద్ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసింది. నిజామాబాద్‌లో జులై 4న పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాపై కేసు నమోదైంది. పీఎఫ్‌ఐ కేసులో తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. ప్రధాన నిందితుడు అబ్దుల్ ఖాదర్ సహా 11 మందిని అరెస్టు చేశారు. నిందితులపై 120బి, 153ఎ, ఉపా చట్టం కింద కేసులు నమోదు చేశారు.

నిందితులు ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నిర్వహించారని ఎన్‌ఐఏ తెలిపింది. ముస్లిం యువతను ఆకర్షించి దాడులకు ప్రేరేపించారని పేర్కొంది. శిక్షణ శిబిరాల్లో యువతను పీఎఫ్ఐ సభ్యులు రెచ్చగొట్టారని అభియోగపత్రంలో తెలిపింది. ఉగ్రవాద చర్యలకు యువకులను నియమించారని వివరించింది. యోగా, ఫిజికల్ ఎడ్యుకేషన్ పేరుతో ఉగ్ర శిక్షణ ఇచ్చారని పీఎఫ్‌ఐపై అభియోగాలు మోపింది. శిక్షణలో యువతకు మారణాయుధాలను ఇచ్చారని ఛార్జిషీట్‌లో పేర్కొంది. వ్యక్తులపై దాడి చేసి, చంపటంలోనూ శిక్షణ ఇచ్చారని ఎన్​ఐఏ పేర్కొంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details