నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో అక్టోబర్ 3న హత్యకు గురైన మమత కేసులో నిందితులను శిక్షించాలంటూ జిల్లా యాదవ సంఘం అధ్యక్షురాలు మంజుల డిమాండ్ చేశారు. ఇందల్వాయి మండలం మాక్లూర్ తండా వద్ద 44 వ జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు.
మమత హత్యకేసులో నిందితులను శిక్షించాలంటూ ధర్నా - నిజామాబాద్ జిల్లా సమాచారం
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో గత నెల 3న హత్యకు గురైన మమత కేసులో నిందితులను శిక్షించాలంటూ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. జిల్లా యాదవ సంఘం అధ్యక్షురాలు మంజుల ఆధ్వర్యంలో ఇందల్యాయి మండలం మాక్లూర్ తండా వద్ద ఆందోళన నిర్వహించారు.
మమత హత్యకేసులో నిందితులను శిక్షించాలంటూ ధర్నా
దాదాపు 30 నిమిషాల పాటు ధర్నా కొనసాగడంతో రోడ్డుపై వాహనాలు భారీస్థాయిలో నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీ శ్రీనివాస్ దర్యాప్తు వేగవంతం చేసి, బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆమె ధర్నా విరమించారు.