పిల్లల్లో సాధారణంగా వచ్చే నులిపురుగులు, పెద్దవాళ్లలో వచ్చే బోదకాలు వ్యాధుల నుంచి రక్షించేందుకు ప్రతిఏటా ఫిబ్రవరి 10న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. బోర్గం ప్రభుత్వ పాఠశాలలో నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు.
బోర్గం ప్రభుత్వ పాఠశాలలో నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ - nizamabad collector visit to borgam government school
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా బోర్గం(పీ) ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
బోర్గం ప్రభుత్వ పాఠశాలలో నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ
సుమారు 5 లక్షల మందికి మాత్రలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారని కలెక్టర్ తెలిపారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ఉపకేంద్రాల్లో మాత్రలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.