నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం దుర్గానగర్ తండాకు చెందిన కేతావత్ లలితకు కుమార్తె నందిని ఉంది. తన చిన్నప్పుడే అమ్మానాన్నలు విడిపోగా... తల్లి దగ్గరే ఉంటున్న నందిని మాక్లూర్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. మానసిక వ్యాధితో బాధపడుతున్న లలిత రోజువారి కూలీ పనిచేస్తూ... బిడ్డను పోషిస్తోంది.
ఈ క్రమంలో బాలిక అనారోగ్యానికి గురైంది. మధుమేహం, థైరాయిడ్ సోకటంతో... నిత్యం ఇన్సులిన్ ఇంజక్షన్ వేసుకుంటుంది. 3 నెలల క్రితమే ఒక కన్ను చూపు పూర్తిగా కోల్పోయిన నందిని... క్రమంగా మరో కంటి చూపును కోల్పోతుంది. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబానికి వచ్చిన కష్టం మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది.