నాగుల పంచమిని నిజామాబాద్ జిల్లాలో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసం శుద్ధ పంచమి రోజును నాగ పంచమి, గరుడ పంచమిగా పిలుస్తారు. మహిళలు నాగపంచమి పురస్కరించుకొని పుట్టలో పాలు పోసి నాగదేవతను పూజించారు.
నిరాడంబరంగా నాగులపంచమి వేడుకలు - నిజామాబాద్లో నాగులపంచమి వేడుకలు
కరోనా నేపథ్యంలో నాగుల పంచమి వేడుకులు నిజామాబాద్లో నిరాడంబరంగా జరిగాయి. నాగశేష ఆలయంలో భక్తులు నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నిరాడంబరంగా నాగులపంచమి వేడుకల
సంతాన సాఫల్యం కోసం, కుటుంబ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుతూ మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని నాగశేష మందిరంలో భక్తులు ఘనంగా నాగుల పంచమిని జరుపుకున్నారు. కొవిడ్ నేపథ్యంలో అత్యంత నిరాడంబరంగా నాగపంచమి వేడుకలు జరిగాయి.
ఇవీ చూడండి:రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..
Last Updated : Jul 25, 2020, 7:03 PM IST