తెలంగాణ

telangana

ETV Bharat / state

Ganesh Laddu auction: మతాలకతీతంగా గణేశ్​ ఉత్సవాలు... వేలంలో లడ్డును దక్కించుకున్న ముస్లింలు - గణేశ్​ ఉత్సవాల్లో ముస్లిం యువకులు

లంబోదరుడి లడ్డు వేలం పాటలో ముస్లింలు పాల్గొని లడ్డును (Ganesh Laddu auction) దక్కించుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా కొప్పర్గలో చోటుచేసుకుంది. మతాలకతీతంగా వీరు వేలంలో లడ్డు దక్కించుకుని ఆనందం వ్యక్తం చేశారు.

Ganesh Laddu auction
గణేశ్​ ఉత్సవాలు

By

Published : Sep 19, 2021, 10:56 PM IST

గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో మతసామరస్యం వెల్లివిరిసింది. మతాలకతీతంగా లంబోదరుడి సేవలో భక్తులు తరిస్తారు. అందుకు నిదర్శనమే ఈ ఘటన. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కొప్పర్గ గ్రామంలో వినాయకుడి వద్ద లడ్డు వేలం నిర్వహించారు. గ్రామానికి చెందిన మీర్జా లతీఫ్ బేగ్, నజీర్ బేగ్​లు గణేశ్​ లడ్డు వేలంపాట (Muslims in Ganesh Laddu auction)లో రూ. 20వేలకు దక్కించుకుని మతసామరస్యాన్ని చాటుకున్నారు. వినాయకుడి లడ్డును వేలంలో దక్కించుకోవడం తమకు సంతోషంగా ఉందని వారు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details