తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​ జిల్లాలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం

నిజామాబాద్​ జిల్లాలోని మున్సిపాలిటీల్లో నామపత్రాల దాఖలు కొనసాగుతున్నాయి. ఆర్మూర్​లోని ప్రభుత్వ బాలికల జూనియర్​ కళాశాలలో 12 కేంద్రాలు, బోధన్​ జూనియర్​ కళాశాల ప్రాంగణంలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

municipal nominations in nizamabad district
నిజామాబాద్​ జిల్లాలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం

By

Published : Jan 9, 2020, 1:15 PM IST

నిజామాబాద్​ జిల్లాలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం

నిజామాబాద్​ జిల్లాలో పురపాలక ఎన్నికల నామినేషన్ల దాఖలు కొనసాగుతున్నాయి. బోధన్​ మున్సిపాలిటీలో 38 వార్డులకు సంబంధించి స్థానిక జూనియర్​ కళాశాల ప్రాంగణంలో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పోలీసుల పటిష్ఠ బందోబస్తు మధ్య నామపత్రాల దాఖలు కొనసాగుతున్నాయి.

ఆర్మూర్​ మున్సిపాలిటీ పరిధిలోని బాలికల జూనియర్​ కళాశాలలో 12 నామపత్రాల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో మూడు వార్డులకు సంబంధించిన నామినేష్లను అధికారులు స్వీకరించారు. 36వ వార్డులో బారడ రమేశ్​ (తెరాస), 31వ వార్డు బారెట్టి సౌమ్య (భాజపా), 33వ వార్డు వినీత్ (తెరాస), 30వ వార్డు సుజాత (తెరాస), 6వ వార్డు మురళీధర్​రెడ్డి (భాజపా) నామపత్రాలు దాఖలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details