వాణిజ్య పంటలైన ఎర్రజొన్న, పసుపు మద్దతు ధర కోసం నిజామాబాద్ రైతులు ఆందోళన చేపట్టారు. గిట్టుబాటు ధర అడిగితే కేసులు పెట్టి భయపెడుతున్నారని మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ ఆరోపించారు. జిల్లా జైలులో రైతన్నలను పరామర్శించిన అనంతరంవారిపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.ఎర్రజొన్న, పసుపు పంటలకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.
మద్దతు ధర ఇవ్వాల్సిందే - CENTRE
ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలని అన్నదాతలు కోరుతున్నారు. ఎర్రజొన్న, పసుపు రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ నేత మధుయాష్కీ డిమాండ్ చేశారు.
నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి : మధుయాష్కీ