నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం వన్నెల్(బీ)లో ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పర్యటించారు. ఎంఆర్‌పీఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్వర్ భార్య కమల పది రోజుల క్రితం మృతి చెందగా... ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఏబీసీడీ వర్గీకరించి... ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేస్తేనే మాదిగలకు న్యాయం జరుగుతుందన్నారు.
ఎస్సీ వర్గీకరణ అమలులో గెలిచి ఓడాం..: మంద కృష్ణ మాదిగ - మంద కృష్ణమాదిగ వన్నెల్ లో పర్యటన
ఎస్సీల్లో ఏబీసీడీ వర్గీకరణతోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని... ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిక అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్గొండ మండలం వన్నెల్(బీ)లో పర్యటించారు.
ఎస్సీ వర్గీకరణ అమలులో గెలిచి ఓడాం..: మంద కృష్ణ మాదిగ
ఎస్సీల్లో అధికశాతం ఉన్న మాదిగలకోసం 26 ఏళ్లుగా పోరాటం చేస్తున్నామన్నారు. అయినా రాజకీయ, ఉద్యోగ, ఉపాధి, విద్యారంగాల్లో సరైన న్యాయం జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 1999-2004 మధ్య ఏబీసీడీ వర్గీకరణతో... 22 వేల మంది మాదిగలు ఉద్యోగాలు పొందారని గుర్తు చేశారు. రిజర్వేషన్ల అమలులో గెలిచి ఓడామని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన భూగర్భజలాలు