తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్‌లో పసుపు బోర్డు అవసరం లేదు: కేంద్రం - mp uttam kumar reddy news

నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుపై లోక్‌సభలో ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రశ్నలు లేవనెత్తారు. బోర్డు ఎందుకు ఏర్పాటు చేయడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు స్పందించిన కేంద్ర మంత్రి.. జిల్లాలో ప్రత్యేకంగా పసుపు బోర్డు అవసరం లేదని స్పష్టం చేశారు. ఆ బోర్డు చేయాల్సిన పనులు సుగంధ ద్రవ్యాల బోర్డు చేస్తోందని తెలిపారు.

నిజామాబాద్‌లో పసుపు బోర్డు అవసరం లేదు: కేంద్రం
నిజామాబాద్‌లో పసుపు బోర్డు అవసరం లేదు: కేంద్రం

By

Published : Mar 16, 2021, 1:46 PM IST

Updated : Mar 16, 2021, 3:19 PM IST

నిజామాబాద్‌లో పసుపు కోసం ప్రత్యేకంగా బోర్డు పెట్టాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం.. లోక్‌సభలో స్పష్టం చేసింది. పసుపు బోర్డు ఏర్పాటుపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి.. కేంద్రాన్ని ప్రశ్నించారు. పసుపు కోసమే ప్రత్యేకంగా బోర్డు పెట్టడం ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయని సభకు తెలిపారు. వంగడాలపై పరిశోధనలు జరుగుతాయని, పసుపు మార్కెటింగ్‌ మెరుగుపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తద్వారా ఎగుమతులు పెరిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

ఉత్తమ్‌ ప్రశ్నపై స్పందించిన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి పరుషోత్తం రూపాలా.. నిజామాబాద్‌లో పసుపు బోర్డు అవసరం లేదని స్పష్టం చేశారు.

50 శాతం జిల్లాలోనే

80 శాతం పసుపు ఉత్పత్తి దేశంలోనే జరుగుతోందని ఉత్తమ్‌ అన్నారు. 50 శాతం పసుపు రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లాలోనే ఉత్పత్తి అవుతోందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న భాజపా.. ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వం.. జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుకు స్థలం కూడా కేటాయింపు జరిగిందని గుర్తు చేశారు.

బోర్డెందుకు.?

స్పందించిన మంత్రి పరుషోత్తం.. పసుపు బోర్డు చేయాల్సిన పని సుగంధ ద్రవ్యాల బోర్డు చేస్తోందని అన్నారు. సుగంధ ద్రవ్యాల బోర్డుతో అవే లాభాలు జరుగుతున్నప్పుడు మరో బోర్డు ఎందుకని వెల్లడించారు.

నిజామాబాద్‌లో పసుపు బోర్డు అవసరం లేదు: కేంద్రం

ఇదీ చదవండి:ఎల్లంపల్లి నీటి కోసం మత్స్యకారుల ధర్నా

Last Updated : Mar 16, 2021, 3:19 PM IST

ABOUT THE AUTHOR

...view details